Asamarthuni JeevaYaatra-First ever psychoanalysis novel in Telugu
"ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరైనా అన్నం తేలికగా దొరికే పద్దతి ఎందుకు కనిపెట్టరు ? ఏ వాసన చూడటం వల్లో, ఏ గాలి పీల్చటం వల్లో, ఏ నీరు తాగటం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు ?" అంటూ తనలో తాను పడే వ్యధను సీతారామారావు పాత్రలో చూపించాడు.
మానవుని మనస్సు ఎన్నో ఆలోచనలు, సిద్ధాంతాలు, భావాలు అనుభవించగలదు అలా అనుభూతి చెందే ప్రతి విషయాన్నీ విమర్శగా విశదీకరించి హృదయాన్ని కదిలిస్తూ, సృజనాత్మకత జోడిస్తూ పాఠకుల గుండెలను సూటిగా గుచ్చుతూ, ఆలోచన పుట్టిస్తూ, ఎందుకు అనే ప్రశ్న రేకెత్తిస్తూ గోపీచంద్ సృష్టించిన ఈ మనోవైజ్ఞానిక నవల ఒక సంచలనం.
అసమర్ధుని జీవయాత్రని ఆరు భాగాలుగా విభజించించాడు గోపీచంద్, ప్రతి భాగంలో ఒక్కో పాత్ర ద్వారా వివిధ కోణాల్లో, వివిధ దృక్పధాలలో సమాజ స్వభావాణ్ణి, సమాజ పరిణామ దశలను కళ్ళకు కట్టాడు. ఈ యాత్ర అసమర్ధునిది మాత్రమే కాదు ప్రతి ఒక్క సమాజ భాగస్వామిది.
No comments:
Post a Comment